నేటి నుంచి ఏపీ అసెంబ్లీ.. ప్రత్యేకతలివీ..

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ.. ప్రత్యేకతలివీ..

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.05 నిమిషాలకు సభ ప్రారంభమవుతుంది. కొత్త ప్రభుత్వంలో ఇవే తొలి సమావేశాలు. మొత్తం 5 రోజులపాటు సమావేశాలు జరుగుతాయి. మొదటి రోజు ఎమ్యెల్యేల చేత ప్రొటెం స్పీకర్ అప్పలనాయుడు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రెండో రోజు స్పీకర్‌గా తమ్మినేని సీతారాంను అధికారికంగా ఎన్నుకుంటారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్, మంత్రులు ఆయణ్ను ఆధ్యక్ష స్థానం దగ్గరకు తీసుకెళ్లి కూర్చోబెట్టి అభినందనలు తెలియజేయనున్నారు. స్పీకర్‌గా ఎన్నికైన సీతారాంకు సభ అభినందనలు తెలియజేస్తుంది. 14న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు. 15,16 తేదీల్లో సభకు సెలవు. ఈ  17,18న సమావేశాలు జరుగుతాయి. 18న సభ వాయిదా పడుతుంది.

ఈ సభలో..

  • 25 మంది మంత్రుల్లో ఏకంగా 19 మంది కొత్త మంత్రులుగా సభలో ప్రవేశం.
  • గత 30 ఏళ్లలో అత్యధిక శాతం మంది కొత్త ఎమ్మెల్యేలు చట్టసభలో అడుగుపెట్టబోతున్న సభ ఇదే.. 
  • రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా దాదాపు 50 శాతం ఓట్లు, 86 శాతం సీట్లు దక్కించుకుని ఓ పార్టీ అధికారంలోకి రావడం ఇదే తొలిసారి.
  • జాతీయ పార్టీల ప్రాతినిధ్యం లేకుండా తొలిసారిగా శాసనసభ
  • ఒకే ఒక ఎమ్మెల్యేతో జనసేన