ఏపీ అసెంబ్లీ సమావేవాలు: కీలక బిల్లులపై వైసీపీ, సమస్యలపై టీడీపీ ఫోకస్

ఏపీ అసెంబ్లీ సమావేవాలు: కీలక బిల్లులపై వైసీపీ, సమస్యలపై టీడీపీ ఫోకస్

ఇవాళ్టి నుంచి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి... కీలక బిల్లులు ప్రవేశపెట్టడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది... అయితే, ఇదే సమయంలో రాష్ట్రంలో నెలకొన్న అనేక సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతోంది ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ. దాదాపు 20 అంశాలపై చర్చకు పట్టుబడట్టే అవకాశం ఉంది. ఆరు నెలల కాలంలో రాజకీయ వేధింపులు, కేసుల వ్యవహారం, నదుల అనుసంధానంపై చర్చకు పట్టుబట్టాలన్నది ఆ పార్టీ వ్యూహంగా తెలుస్తోంది. కనీసం రెండు వారాల పాటు సభ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు, మరోవైపు విపక్షం ఆరోపణలు తిప్పికొట్టడానికి వైసీపీ కూడా సన్నద్ధమైంది. మొత్తంగా ఈ శీతాకాల సమావేవాలు హాట్ హాట్‌గా సాగనున్నాయి. మరోవైపు ఇవాళ వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి సమావేశాలకు హాజరుకానున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. అనంతరం పెరిగిన ఉల్లి ధరలపై నిరసనగా చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు పాదయాత్రగా అసెంబ్లీకి వెళ్లనున్నారు.