ఏపీ అసెంబ్లీ సమావేశాలు లైవ్‌

ఏపీ అసెంబ్లీ సమావేశాలు లైవ్‌

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ రెండో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. 174 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం నిన్న పూర్తవగా.. నరసరావుపేట వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్‌ శంబంగి చిన వెంకట అప్పల నాయుడు... గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక.. ఇవాళ స్పీకర్‌ ఎన్నిక జరగనుంది. ఈ పదవికి తమ్మినేని సీతారాం ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో  ఆయన ఎన్నికను ఇవాళ లాంఛనంగా ప్రకటించనున్నారు.