మళ్ళీ నోరు జారిన ఏపీ స్పీకర్

మళ్ళీ నోరు జారిన ఏపీ స్పీకర్

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ మరో మారు నోరు జారారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. రాష్ట్ర రాజధాని అమరావతి తరలింపు ఖాయమైన నేపథ్యంలో సీఆర్‌డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్పీకర్ తమ్మినేని సీతారామ్ స్వయంగా ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరపాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సవాళ్ల పర్వం జోరుగా సాగుతున్నందున నిజాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని స్పీకర్ హోదాలో తమ్మినేని సీతారామ్ ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చారు.

దీనికి సీఎం జగన్ వెంటనే స్పందించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారంపై విచారణకు జరిపిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సభలో ప్రకటించారు. అయితే విచారణ జరపాలని కోరే హక్కు మీకు ఎవరిచ్చారని స్పీకర్‌ను ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ ను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో స్పీకర్‌ మాట్లాడుతుండగా టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అడ్డు తగిలారు. దీంతో ఆగ్రహించిన స్పీకర్‌.. ‘ఏం.. సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఉందా’ అంటూ అచ్చెన్నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి ఆయన అక్కడ వాడాల్సింది కామన్ సెన్స్ అయితే ఆయనకు ఆ పదం తట్టలేదు అందుకే  సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఉందా ? అంటూ గట్టిగానే కోపగించుకున్నారు.