భూమివైపు దూసుకొస్తున్న గ్రహశకలం... డెంజరే...కానీ... 

భూమివైపు దూసుకొస్తున్న గ్రహశకలం... డెంజరే...కానీ... 

భూమివైపు 39 అడుగుల పొడవైన ఓ భారీ గ్రహశకలం దూసుకొస్తున్నట్టు నాసా పేర్కొన్నది.  ఇది సెకనుకు 8.16 కిలోమీటర్ల వేగంతో భూమి దిశగా దూసుకు వస్తున్నది.  సెప్టెంబర్ 1 వ తేదీనాటికి భూమి చంద్రుడు మధ్య ఉన్న దూరం కంటే తక్కువ దూరంలో భూమిని దాటుకొని వెళ్తుందని, దీని వలన ప్రస్తుతం భూమికి ఎలాంటి ప్రమాదం లేదని, కానీ, భవిష్యత్తులో ఈ గ్రహశకలం వలన భూమికి ప్రమాదం ఉండే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారు.  

ఈ గ్రహశకలానికి 2011 ఈఎస్ 4 అనే పేరు పెట్టారు.  2011లో ఒకసారి ఇదే గ్రహశకలం భూమికి దగ్గరగా వచ్చింది.  అయితే, ఈసారి గతంలో కంటే మరింత దగ్గరగా వచ్చి భూమిని దాటి వెళ్తుందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.  ఇలాంటి గ్రహశకలాల వలన ఎప్పటికైనా భూమికి ప్రమాదమే అని నాసా పేర్కొన్నది.  అందుకే ఈ 2011 ఈఎస్ 4 గ్రహశకలాన్ని ప్రమాదకరమైన గ్రహశకలాల జాబితాలో చేర్చారు.  ఇలాంటి వేగంగా దూసుకువచ్చి భూమిని ఢీకొడితే, భూకంపాలు వస్తాయని నాసా పేర్కొన్నది.