ఆ గ్రహశకలం భూమిని ఢీకొంటే...!!

ఆ గ్రహశకలం భూమిని ఢీకొంటే...!!

ఆదివారం రోజున 465824 అనే గ్రహశకలం భూమిని దాటుకొని వెళ్ళింది.  భూమికి 74 లక్షల కిలోమీటర్ల అవతల నుంచి దాటుకొని వెళ్ళింది.  అంటే భూమికి చంద్రునికి మధ్య దూరం కంటే 19 రెట్ల ఎక్కువ దూరం నుంచి దాటుకొని వెళ్ళింది.  అంతదూరం నుంచి దాటుకొని వెళ్లినా దానిపై నాసా ఓ కన్నేసి ఉంటుంది.  దానికి కారణం లేకపోలేదు.  ఈ గ్రహశకలం గిజా పిరమిడ్ కంటే పెద్ద గ్రహశకలం కావడంతో పాటుగా ఇది సెకనుకు 14 కిలోమీటర్ల వేగంగా ప్రయాణం చేస్తూ భూమివైపు దూసుకు వచ్చింది.  అంతేకాదు, ఈ గ్రహశకలం భూ వాతావరణంలోకి ప్రవేశించడంతో నాసా అప్రమత్తం అయ్యింది.  సెకనుకు 14 కిలోమీటర్ల వేగంగా దూసుకొచ్చే గ్రహశకలాలు భూమిని ఢీకొంటే భూమి ముక్కలౌతుంది.  అందుకే నాసా అప్రమత్తం అయ్యి ఆ గ్రహశకలంపై కన్నేసి ఉంచింది.  ఇదే ఉపగ్రహం 2010లో ఒకేసారి కనిపించినట్టు నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారు.