చంద్రబాబుకు రెండే కులాలు..

చంద్రబాబుకు రెండే కులాలు..

చంద్రబాబు దృష్టిలో రెండే రెండు కులాలు ఉన్నాయనీ... అవి ఒకరు పేద మరొకరు ధనిక వర్గం అని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఏ కులంలో పేదవారు ఉన్నా అలాంటి వారందరికీ ఫలాలు అందించాలని సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జగన్ బీసీ పల్లవి తెరమీదకు తెచ్చారని ఆరోపించారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు ఏమి చేసారో జగన్ ఒకసారి చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. గత నాల్గు సంవత్సరాల్లో చంద్రబాబు బీసీలకు ఏమి చేశారో తెలియచేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని తెలిపారు. చర్చకు టీడీపీ రెడీ, జగన్ కూడా రెడీనా అని సవాల్ విసిరారు. ధైర్యముంటే  సవాల్ ను జగన్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. చర్చ ఎక్కడ, ఎప్పుడూ అనేది జగన్ ఇష్టమే అని అచ్చెన్నాయుడు తెలిపారు.