మేం చేసిన తప్పేంటో..?: అచ్చెన్నాయుడు

మేం చేసిన తప్పేంటో..?: అచ్చెన్నాయుడు

మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలపై నాలుగు రోజుల నుంచి ఆలోచిస్తున్నానని.. ప్రజాగ్రహానికి గురికావడానికి టీడీపీ చేసిన తప్పేంటో కారణాలు కనబడడం లేదని మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఇవాళ శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ ప్రచారంలో ప్రజలు ఆదరించారని.. అయినా ఓడిపోయామని అన్నారు. 

'ఈ పరిణామాలపై పార్టీలో చర్చ జరగాలి. ఓటమిపై విశ్లేషణ చేసుకోవాలి. పార్టీని పటిష్టం చేయడమే మన ముందున్న కర్తవ్యం' అని అభిప్రాయపడ్డారు. కార్యకర్తలకు అండగా ఉంటామన్న ఆయన.. కార్యకర్తలు అధైర్యపడొద్దని సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి, వైసీపీకి లక్ష ఓట్లే తేడా అని అచ్చెన్న చెప్పారు.