'మా నేతను చూస్తే మోడీకి దడ'

'మా నేతను చూస్తే మోడీకి దడ'

'2014లో ఇష్టం లేకపోయినా.. నష్టం జరుగుతుందని తెలిసినా.. గత్యంతరం లేక బీజేపీతో జత కట్టాం' అని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో జరుగుతున్న ధర్మపోరాట దీక్షలో ఆయన మాట్లాడుతూ మనల్ని మోసం చేసినందున బీజేపీ నుంచి బయటకు వచ్చి.. బొబ్బిలి పులిలా, కొండవీటి సింహంలా పోరాడుతున్నామన్నారు. చంద్రబాబును చూసి మోడీకి గుండె దడ పుడుతోందని చెప్పారు.  తెలంగాణలో టీఆరెఎస్, రాష్ట్రం లో వైసీపీ, జనసేన పార్టీలు మోడీకి దత్త పుత్రులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చడానికి మోడీ డైరెక్షన్‌లో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో నాటకం ఆడుతున్నారని అచ్చెన్నాయుడు అన్నారు.