అతిలోక సుందరికి సినీలోకం నీరాజనాలు

 అతిలోక సుందరికి సినీలోకం నీరాజనాలు

అతిలోక సుందరి శ్రీదేవి 1963 ఆగష్టు 13 వ తేదీన తమిళనాడులో జన్మించింది.  చిన్ననాటి నుంచే సినిమాల్లో నటించడం మొదలుపెట్టిన శ్రీదేవి పదహారేళ్ళ వయసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  ఆ సినిమా తరువాత తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అనేక చిత్రాల్లో నటించింది.  ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా ఉన్న అందరితోను శ్రీదేవి నటించింది.  తెలుగులో ఆమె నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా క్లాసికల్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.  అప్పటి నుంచే ఆమెకు అతిలోక సుందరి అని పేరు వచ్చింది.  

30 సంవత్సరాలపాటు వెండితెరపై తిరుగులేని తారగా వెలుగొందిన శ్రీదేవి.. ఫిబ్రవరి 24, 2018 లో దుబాయ్ లోని హోటల్ లో అకస్మాత్తుగా మరణించారు.  ఆమె బౌతికంగా సినిమా ప్రపంచం నుంచి దూరమైనా.. ఆమె నటించిన చిత్రాల ద్వారా ఎప్పటికి మనముందే ఉంటారు.  టాలీవుడ్, బాలీవుడ్లో అనేక చిత్రాల్లో నటించిన శ్రీదేవికి హాలీవుడ్ లో నుంచి కూడా ఓ ఆఫర్ వచ్చింది.  సైంటిఫక్ చిత్రాల రూపకర్త స్టీఫెన్ స్పీల్ బర్గ్ దర్శకత్వం వహించిన జురాసిక్ పార్క్ సినిమాలో నటించాలని శ్రీదేవిని కోరాడట.  బాలీవుడ్ నుంచి దూరం కావడం ఇష్టం లేక శ్రీదేవి అందులో నటించలేదట.  ఒకవేళ శ్రీదేవి ఆ సినిమాలో చేసి ఉంటె.. అంతర్జాతీయంగా ఖ్యాతి గాంచేది.  

బాలీవుడ్ కు వచ్చిన మొదట్లో శ్రీదేవికి హిందీ రాదట.  కష్టపడి హిందీ నేర్చుకున్నారు.  1985 నుంచి 1992 వరకు బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకున్న నటి శ్రీదేవి.  శ్రీదేవి టాప్ పొజిషన్లో ఉండగా అమెరికా, ఇంగ్లాండ్ నుంచి అనేకమంది ఆమెకు ప్రపోజ్ చేశారట. శ్రీదేవి వాటిని పట్టించుకోలేదు.  తన కేరీర్ మీదనే దృష్టి సారించింది కాబట్టే ఆమె ఇప్పటికి సినీప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.  ఈరోజు శ్రీదేవి 55 వ పుట్టినరోజు. బౌతికంగా శ్రీదేవి లేకపోయినా.. ఆమె మిగిల్చి వెళ్లిన జ్ఞాపకాలను సినీప్రియులు నెమరువేసుకుంటున్నారు.