అట్లీకి బాలీవుడ్ రెడ్ కార్పెట్... 

అట్లీకి బాలీవుడ్ రెడ్ కార్పెట్... 

బాలచందర్, బాలు మహేంద్ర, శంకర్, మురుగదాస్, బాల ఇలా ఎందరో కోలీవుడ్ దర్శకులు బాలీవుడ్ లో సినిమాలు చేసి మెప్పించారు.  ప్రస్తుతం ప్రభుదేవా బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో సినిమాలు చేస్తున్నారు.  సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 సినిమాకు ప్రభుదేవా దర్శకుడు.  ఈ సినిమా తరువాత సల్మాన్ తో రాధే చేస్తున్నాడు.  ఇది వచ్చే ఏడాది ఈద్ కు రిలీజ్ కాబోతున్నది.  

ఇప్పుడు ఇదే బాటలో అట్లీ కూడా నడవబవుతున్నాడు.  అట్లీ కోలీవుడ్ లో రాజారాణి, తేరి, మెర్సల్, ఇప్పుడు బిగిల్ సినిమాలు చేశాడు.  ఈ నాలుగు సినిమాలు మంచి విజయాలు సొంతం చేసుకున్నాయి.  బిగిల్ సినిమాకు బాలీవుడ్ ఫిదా అయ్యింది.  బిగిల్ లో విజయ్ యాక్షన్ కు, అలానే బిగిల్ డైరెక్టర్ డైరెక్షన్ కు బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు.  కాగా, దర్శకుడు అట్లీకి ఇప్పుడు కోలీవుడ్ నుంచి ప్రమోషన్ వచ్చింది.  బాలీవుడ్ లో ఏకంగా షారుక్ ఖాన్ తో సినిమా చేసే అవకాశం లభించింది.  నవంబర్ 2 వ తేదీన ఈ సినిమాను అఫీషియల్ గా ప్రకటించబోతున్నారు.  బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంకీ అనే టైటిల్ పెట్టినట్టు తెలుస్తోంది.  షారుక్ చాలా కాలంగా హిట్స్ లేక ఇబ్బందులు పడుతున్నాడు.  అట్లీ సినిమాతో మరలా హిట్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.