ఫెడరర్‌ విజయం.. ఆశలు సజీవం

ఫెడరర్‌ విజయం.. ఆశలు సజీవం

ఏటీపీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో స్విట్జర్లాండ్‌ స్టార్ ఆటగాడు రోజర్‌ ఫెడరర్‌ తొలి విజయంను అందుకున్నాడు. దీంతో ఏటీపీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో తన ఆశలను సజీవంగా ఉంచుకున్నాడు. హెవిట్‌ గ్రూప్‌లో భాగంగా డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) తో జరిగిన రెండో లీగ్‌ మ్యాచ్‌లో ఫెడరర్‌ 6–2, 6–3తో వరుస సెట్లలో గెలిచాడు. గురువారం జరిగే చివరి రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌లో నిషికోరి (జపాన్‌)పై థీమ్‌ గెలిచి.. అండర్సన్‌ (దక్షిణాఫ్రికా)పై ఫెడరర్‌ విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా స్విస్ దిగ్గజం సెమీఫైనల్‌కు చేరుకుంటాడు.