తొలి మ్యాచ్‌లోనే ఫెద‌ర‌ర్ ఓటమి

తొలి మ్యాచ్‌లోనే ఫెద‌ర‌ర్ ఓటమి

ఏటీపీ ఫైన‌ల్స్ టోర్నీలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లోనే స్విస్ స్టార్ ప్లేయర్ రోజ‌ర్ ఫెద‌ర‌ర్ ఓటమిని చవిచూశాడు. జ‌పాన్ ప్లేయ‌ర్ కి నిషికోరి స్విస్ స్టార్ కు షాక్ ఇచ్చాడు. ఫెద‌ర‌ర్ 7-6, 6-3  స్కోర్‌తో వ‌రుస సెట్ల‌లో ఓడిపోయాడు. రౌండ్ రాబిన్ లీగ్ ప‌ద్ధ‌తిలో జ‌రిగే ఈ టోర్నీ మొదటి మ్యాచ్‌లో ఓడిన ఫెద‌ర‌ర్‌కు సెమీ ఫైన‌ల్‌కు అర్హ‌త సాధించే అవకాశాలు తగ్గిపోయాయి. గ‌తంలో ఆరు సార్లు ఈ టోర్నీని గెలిచిన ఫెద‌ర‌ర్‌ మొదటి మ్యాచ్ లోనే ఓడిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మ్యాచ్ 12వ గేమ్‌లో ఫెద‌ర‌ర్ స‌హ‌నాన్ని కోల్పోవడంతో వార్నింగ్ కి కూడా గురయ్యాడు. 

'నిజానికి ఈ మ్యాచ్ గురించి ఆలోచించట్లేదు. నాకు అంత టైం కూడా లేదు. నేను తరువాతి ఆటను ఎవరితో ఆడుతానో కూడా ఆలోచించడం లేదు. నాకు తెలుసు.. ఈ రోజు కన్నాబాగా ఆడాలని' అని మ్యాచ్ అనంతరం ఫెద‌ర‌ర్ అన్నారు.