సెమీస్‌లో ఫెడరర్‌, జొకోవిచ్‌

సెమీస్‌లో ఫెడరర్‌, జొకోవిచ్‌

సీజన్‌ ముగింపు టోర్నమెంట్‌ ఏటీపీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీలో సీనియర్ ఆటగాళ్లు రోజర్‌ ఫెడరర్‌ (స్విజర్లాండ్), నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా)లు విజయాలు సాధించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. ఫెడరర్‌ లీగ్‌ తోలి మ్యాచ్‌లో ఓడినా.. ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో సత్తాచాటాడు. చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఫెడరర్‌ 6–4, 6–3తో కెవిన్‌ అండర్సన్‌ (దక్షిణాఫ్రికా)పై గెలుపొందాడు. ఫెడరర్‌ సెమీఫైనల్‌కు చేరడం ఇది 15వసారి. లీగ్‌ మ్యాచ్‌లు ముగిశాక రెండేసి విజయాలు సాధించిన ఫెడరర్, అండర్సన్‌ ‘హెవిట్‌ గ్రూప్‌’ నుంచి సెమీఫైనల్‌కు అర్హత పొందారు. ‘కుయెర్టన్‌ గ్రూప్‌’ నుంచి స్టార్ ఆటగాడు నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా), అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)లు సెమీస్‌లోకి అడుగుపెట్టారు. శనివారం జరిగే సెమీఫైనల్స్‌లో జ్వెరెవ్‌తో ఫెడరర్‌, అండర్సన్‌తో జొకోవిచ్‌ తలపడతారు.