వికారాబాద్‌లో దారుణం..

వికారాబాద్‌లో దారుణం..

వరుసగా ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా, వికారాబాద్ లో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. మహిళను అత్యాచారం చేసి ఆపై దారుణంగా హత్య చేసినట్టు భావిస్తున్నారు పోలీసులు.. మహిళ నోట్లో గుడ్డలు కుక్కి గొంతు నులిమి హత్య చేసినట్టుగా ఆనవాళ్లు లభించాయని చెబుతున్నారు.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం ఆధారాలను సేకరించారు.. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ధారూర్ మండలం ఆవుసుపల్లి గ్రామానికి చెందిన అమృతమ్మ (38), భర్త చంద్రయ్య, కొడుకు, కూతురు ఉన్నారు. వీరు వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయ పనులు లేని సమయంలో అడ్డా కూలీలుగా పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలోనే గురువారం అమృతమ్మ ఇంటి నుంచి కూలి పనికోసం వికారాబాద్ వెళ్లింది.. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వికారాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు తెలిసిన వారి వద్ద వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది.. దీంతో ఇవాళ ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు పోలీసులు.. మరోవైపు.. వికారాబాద్ ఆలంపల్లి నుంచి గిరిగేట్ పల్లి వెళ్లే దారిలో రైలు పట్టాల ప్రక్కనే పొలంలో అమృతమ్మ చనిపోయినట్లు పోలీసులకు సమాచారం అందించింది.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన మహిళ, చనిపోయిన మహిళ ఒకరిగా గుర్తించారు. మహిళపై అత్యచారం చేసి.. హత్యచేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. నోట్లో గుడ్డలు కుక్కి హత్య చేసినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయి.