కుట్రతోనే పేర్ని నానిపై దాడికి పాల్పడ్డాడని ఆరోపణ...

కుట్రతోనే పేర్ని నానిపై దాడికి పాల్పడ్డాడని ఆరోపణ...

ఈరోజు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది. మచిలీపట్నంలో ఉన్న ఆయన నివాసం వద్ద గుర్తు తెలియని వ్యక్తి ఇళ్ళు కట్టే తాపీ తో దాడి చేశారని అంటున్నారు. ఈ క్రమంలో మంత్రి నాని తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారని అంటున్నారు. అయితే పేర్ని నాని పై దాడి తప్పకుండా కుట్రే అంటున్నారు మంత్రి పేర్ని అనుచరులు. దాడికి పాల్పడిన నాగేశ్వరరావు టీడీపీకి చెందిన కాంట్రాక్టర్ సొదరుడంటున్నారు నాని అనుచరులు. కుట్రతోనే పేర్ని నాని పై దాడికి పాల్పడ్డాడని... గతంలో ఒకట్రెండు సందర్భాల్లో నాగేశ్వరరావును చూశామని తెలుపుతున్నారు. అయితే రెక్కి నిర్వహించి మరీ దాడి చేశారా అనే కోణంలో పోలీసుల విచారణ జరుగుతుంది. దాడికి పాల్పడిన నాగేశ్వరరావుకు టీడీపీతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. అయితే పేర్ని నాని నుంచి సమాచారం సేకరించారు జిల్లా ఎస్పీ.