ఆర్నాల్డ్‌పై దాడి

ఆర్నాల్డ్‌పై దాడి

హాలీవుడ్‌ హీరో ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగ్గర్‌పై దాడి జరిగింది. జోహెన్నస్‌బర్గ్‌లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన ఫ్యాన్స్‌కు ఆటోగ్రాఫ్‌లు ఇస్తుండగా, వెనుక నుంచి ఓ యువకుడు తన్నాడు. ఈ ఘటన శనివారం జరిగింది. వెంటనే ఆయన బాడీగార్డు రంగంలోకి దిగి... ఆ యువకుడ్ని పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. గతంలో ఇలాంటి ఘటనలకు సదరు యువకుడు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. జోహెన్నస్‌బర్గ్‌ లో ఏర్పాటు చేసిన ఆర్నాల్డ్‌ క్లాసిక్‌ ఆఫ్రికా పేరుతో ఓ అంతర్జాతీయ మల్టి స్పోర్స్ట్‌ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆర్నాల్డ్‌ స్వయంగా ట్వీట్‌ చేశారు. తనపై జరిగిన డాడిపట్ల ఆందోళన వ్యక్తం చేసిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.