ఎంపీ సలీంపై కాల్పులు

ఎంపీ సలీంపై కాల్పులు

సీపీఎం సీనియర్‌ నేత, ఎంపీ మొహ్మద్‌ సలీంపై ఇవాళ దాడులు జరిగాయి. ఆయన కాన్వాయ్‌పై ఇటుకులతో దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఆయన కారుపై బుల్లెట్స్‌తో కాల్పులు కూడా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.  ఈ ఘటన ఇస్లామ్‌పూర్‌ సమీపంలోని ఓ గ్రామంలో  జరిగింది.  రెండో దశ పోలింగ్‌లో భాగంగా ఇక్కడ ఓటింగ్‌ జరుగుతోంది.  దాడి నుంచి సలీం సురక్షితంగా తప్పించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఇస్లామ్‌పూర్‌లోని సీపీఎం ఆఫీసులో ఉన్నారు.  ఇస్లామ్‌పూర్‌ సమీపంలోని గిడ్డి ఏరియాలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతం తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆధిపత్యంలో ఉంది.  మైనారిటీలు అధికంగా ఉండే ఈ ఏరియాలో పరిస్థితిని స్వయంగా సమీక్షించేందుకు సలీం వెళ్ళినట్లు తెలుస్తోంది.