హీరో రాజశేఖర్ సోదరుడిపై దాడి !

హీరో రాజశేఖర్ సోదరుడిపై దాడి !

 

తన సోదరుడు గుణశేఖర్ వరదరాజన్ పై గత కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి గత శనివారం దాడి చేశాడని సినీ హీరో రాజశేఖర్ బంజారాహిల్స్ ఏసీపీకి పిర్యాదు చేశారు.  గుణశేఖర్ బంజారాహిల్స్ లో గుణ డైమండ్స్ షోరూమ్  నిర్వహిస్తుంటాడు.  శనివారం సాయంత్రం కౌశిక్ రెడ్డి షో రూమ్ ముందు అనుమతి లేకుండానే తన కారును నిలిపివేసి వెళిపోయాడు.  ఇదేమిటని ప్రశ్నించినందుకు కౌశిక్  గుణపై దాడిచేసి గాయపరిచాడు.  ఈ విషయం తెలుసుకున్న రాజశేఖర్ తన భార్య జీవితతో కలిసి పోలీసు పిర్యాదు చేశారు.  కౌశిక్ రెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీచేశాడని తెలుస్తోంది.