'జబర్దస్త్‌' ఆర్టిస్ట్‌పై హత్యాయత్నం..!

'జబర్దస్త్‌' ఆర్టిస్ట్‌పై హత్యాయత్నం..!

జబర్దస్త్ టీవీషోలో నటిస్తున్న వినోద్‌పై దాడి జరగడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కాచిగూడ పరిధిలోని కుత్బిగూడలో వినోద్‌ అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. ఆ ఇంటిని కొనుగోలు చేసేందుకు యజమానితో ఒప్పందం చేసుకున్నాడు వినోద్‌. ఇందు కోసం అడ్వాన్స్‌గా రూ.10 లక్షల చెల్లించాడు. అడ్వాన్స్‌ తీసుకున్నాక ఇంటిని విక్రయించబోనని యజమాని మాటమార్చచంతో వినోద్‌ నిలదీశాడు. 

ఈ నేపథ్యంలో మాట్లాడటానికంటూ వినోద్‌ను ఇంటికి పిలిపించిన యజమాని.. అతని భార్య, కొడుకులతో కలిసి దాడి చేశాడు. ఈక్రమంలో హత్యాయత్నం చేశారంటూ వినోద్.. కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వినోద్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదు చేసినట్టు తెలిసింది. జబర్దస్త్‌ షోలో వినోద్‌.. లేడీ గెటప్‌లో వినోదినిగా అలరిస్తున్నాడు.