మద్యం మత్తులో ఘర్షణ, ఒకరు మృతి

మద్యం మత్తులో ఘర్షణ, ఒకరు మృతి

మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి పద్మావతి వైన్ షాప్ వద్ద మద్యం సేవించిన పూర్ణశేఖర్, రమేష్ అనే వ్యక్తులు ఘర్షణకు దిగారు. కోపోద్రిక్తుడైన రమేష్ బీర్ బాటిల్ తో పూర్ణ గొంతు కోసి పరారయ్యాడు. దీంతో అక్కడిక్కడే  పూర్ణ చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.