ప్రేక్షకులే అరవిందను పైరసీ చేస్తే ఎలా !

ప్రేక్షకులే అరవిందను పైరసీ చేస్తే ఎలా !

ఈ మధ్య సోషల్ మీడియా హవా ఎక్కువైన దగ్గర్నుండి థియేటర్లలో సినిమాలకు సెక్యూరిటీ తక్కువైపోయింది.  మొదటిరోజు మొదటి షో సినిమా చూస్తున్నామనే ఉత్సాహంలో ప్రేక్షకులు కొందరు సెలఫోన్లతో హీరో ఇంట్రడక్షన్, కీలకమైన ఫైట్స్, మంచి మంచి మూమెంట్స్ వంటి వాటిని ఫోటోలు, వీడియోలు తీసి ట్విట్టర్, ఫేస్ బుక్ లలో పోస్ట్ చేస్తున్నారు. 

కొందరైతే ఫేస్ బుక్ అకౌంట్స్ లో ఎంకంగా కాసేపు థియేటర్ నుండి లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చేస్తున్నారు.  ఈ ఘటనలన్నీ ఈరోజు విడుదలైన 'అరవింద సమేత'కు జరిగాయి.  సోషల్ ఫ్లాట్ ఫామ్ ఏది చూసిన అందులో ఈ సినిమా తాలూకు చిన్న చిన్న క్లిపింగ్స్, ఫోటోలు కనిపిస్తున్నాయి.  వీటిని చూశాక చిత్రాన్ని చూడని వాళ్లకు ఇకపై చూడాలనే ఎగ్జైట్మెంట్ నశించే ప్రమాదం ఉంది.  దీన్ని కూడ ఒకరకమైన పైరసీయే అనాలి.  కాబట్టి ప్రేక్షకులు కొంత అత్యుత్సాహాన్ని తగ్గించుకుని ఫోన్లలో సినిమాను బంధించడం ఆపితే మంచిది.