'అరవింద సమేత'లోని పాటల వివరాలు !

'అరవింద సమేత'లోని పాటల వివరాలు !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'అరవింద సమేత' చిత్ర ఆడియో ఈ నెల 20న నేరుగా మార్కెట్లోకి రానుంది.  ఎలాంటి హడావుడి లేకుండా పాటల్ని రిలీజ్ చేస్తున్నారు.  అయితే విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు టీమ్.    

ఇక ఆడియో విషయానికొస్తే ఇందులో మొత్తం నాలుగే పాటలుంటాయట.  వాటిలో రెండు డ్యూయెట్లని తెలుస్తోంది.  వాటిలో ఒకటి 'అనగనగా' మొన్ననే విడుదలైంది.  ఈ రెండూ కాకుండా హీరోపై ఒక సాంగ్ ఉంటుందట.  దీన్నిబట్టి పాటలకి పెద్దగా సమయం కేటాయించలేదని, సందర్బానుసారంగా మాత్రమే పాటలు వస్తాయని అర్థమవుతోంది.  త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను అక్టోబర్ 11న విడుదలచేయనున్నారు.