ప్రిన్సెస్ లతీఫా-మిషెల్ మార్పిడి-యుఎన్ కి కేసు

ప్రిన్సెస్ లతీఫా-మిషెల్ మార్పిడి-యుఎన్ కి కేసు

ఆగస్టా వెస్ట్ ల్యాండ్ వీవీఐపీ డీల్ లో మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్ ను భారత్ కి రప్పించిన లింక్ దుబాయ్ రాజకుమారి షేర్ లతీఫాతో కలుస్తోంది. మిషెల్ ను భారత్ నుంచి పంపిన దుబాయ్ రాజకుమారి లతీఫాతో మార్చుకున్నట్టు చెబుతున్నారు. న్యూఢిల్లీలో ఆసియా, యూరప్ దౌత్యవర్గాలు ఒక బ్రిటిష్ వార్తాపత్రికకు ఈ మార్పిడి గురించిన సమాచారాన్ని అందించాయి. అప్పగింతను ప్రశ్నిస్తూ మిషెల్ తరఫు న్యాయవాది ఈ కేసును ఐక్యరాజ్యసమితి పరిశీలనకు పంపనున్నట్టు చెప్పారు.

మిషెల్ అప్పగింతపై ప్రశ్నలు
- న్యూఢిల్లీలో ఆసియా, యూరప్ దౌత్యవర్గాలు బ్రిటిష్ వార్తాపత్రికకు ఈ మార్పిడికి సంబంధించిన సమాచారం ఇచ్చాయి. భారత్ నుంచి పంపిన ప్రిన్సెస్ లతీఫాకు బదులు మిషెల్ ను అప్పగించినట్టు తెలిపారు.
-లండన్ లో అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయవాది టాబీ క్యాడ్ మ్యాన్ లతీఫా కేసును యుఎన్ కు పంపారు. ఇప్పుడు మిషెల్ కుటుంబానికి కూడా అలాగే చేయమని సలహా ఇచ్చారు.
-మిషెల్ అప్పగింత కోసం ఒకసారి కాదు.. అనేక మార్లు మార్పిడి ప్రక్రియకు ప్రయత్నాలు జరిగినట్టు ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తాపత్రికకు చెప్పారు.
-మిషెల్ అప్పగింత వ్యవహారంపై తగిన విధంగా దర్యాప్తు జరపాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కేసును యుఎన్ పరిశీలనకు పంపాలన్నారు.

తప్పుడు పద్ధతి అనుసరించారనే ఆరోపణ
-ఇప్పటికిప్పుడు తను సాక్ష్యాలను చూపలేనని క్యాడ్ మ్యాన్ తెలిపా రు. కానీ మిషెల్ అప్పగింత కోసం అనుసరించిన పద్ధతి తప్పు అని స్పష్టం చేశారు. ఇది ఎంతో గంభీరమైన విషయం అన్నారు.
-మిషెల్ ను పట్టుకొని ఉంచేందుకు ఎలాంటి న్యాయపరమైన ఆధారాలు లేవని త్వరలోనే భారత న్యాయవ్యవస్థ అధికారులు గుర్తించి వెంటనే విడుదల చేస్తారని క్యాడ్ మ్యాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. 
-మిషెల్ ఒక కోటీశ్వరుడైన బ్రిటిష్ ఆయుధాల డీలర్. ఇతను దుబాయ్ నుంచి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తాడు. గత నెల అతనిని దుబాయ్ ప్రభుత్వం భారత్ కు అప్పగించింది. ప్రస్తుతం సీబీఐ, ఈడీ బృందాలు అతనిని ప్రశ్నిస్తున్నాయి.

రాజకుమారికి బదులు అప్పగింత
-ప్రిన్సెస్ లతీఫా దుబాయ్ పరిపాలకుడు, యుఏఈ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రాషిద్ అల్ మక్తూమ్ కుమార్తె. ఆమెను భారత్ తిరిగి స్వదేశానికి పంపిన 8 నెలలకు మిషెల్ ను అప్పగించడం జరిగింది. 
- లతీఫా యుఏఈ నుంచి పారిపోయి భారత్ వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న నౌకను భారత కోస్ట్ గార్డ్ గోవా తీరంలో పట్టుకుంది. ఆ తర్వాత భారత్-యుఏఈ సంయుక్త ఆపరేషన్ లో ఆమెను దుబాయ్ కి పంపించారు.
- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షేక్ మొహమ్మద్ తో ఫోన్ లో మాట్లాడిన తర్వాత ఈ జాయింట్ ఆపరేషన్ కు అనుమతి ఇచ్చినట్టు తెలిసింది.
- చట్టవిరుద్ధంగా చేపట్టిన చర్యలో పాలు పంచుకున్నందుకు భారత్ అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ కారణంగా యుఎన్ ప్రారంభించిన అఫిషియల్ ఎంక్వైర్ లో కూడా భారత్ పై కన్నేసి ఉంచింది.
- ప్రిన్సెస్ లతీఫా వ్యవహారంలో భారత్ సహకారం తర్వాత యుఏఈ పరస్పర మార్పిడి కింద మిషెల్ ను అప్పగించినట్టు కనిపిస్తోంది.