దుబాయ్ చేరుకున్న ఇంగ్లాండ్, ఆసీస్ ఆటగాళ్లు...

దుబాయ్ చేరుకున్న ఇంగ్లాండ్, ఆసీస్ ఆటగాళ్లు...

కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2020 సీజన్ రేపు ప్రారంభమవుతుంది. ఇప్పటికే చాలామంది విదేశీ ఆటగాళ్లు అక్కడికి చేరుకున్నారు. కరేబియన్ లీగ్ కూడా ముగియడంతో అందులో పాల్గొన ఆటగాళ్లు కూడా యూఏఈ కి వచ్చేసారు. ఇక తాజాగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు దుబాయ్ వచ్చారు. అయితే ఐపీఎల్ కు ముందు ఈ రెండు జట్లు టీ 20 సిరీస్ అలాగే వన్డే సిరీస్ లో తలపడ్డాయి. ఈ ఆసీస్ పర్యటన సెప్టెంబరు16న ముగియడంతో వారు ఈ రోజు దుబాయ్ వచ్చారు. అయితే  వారు అక్కడినుండి ఇక్కడికి రావడానికి ఛార్టర్డ్ ప్లైట్‌ ఏర్పాటు చేసాయి ఫ్రాంఛైజీలు. ఎందుకంటే ఆ రెండు జట్లలో ఐపీఎల్ వివిధ జట్లలో ఆడాల్సిన ఆటగాళ్లు ఉన్నారు. కాబట్టి వారందరిని విడివిడిగా తీసుకొని రాకుండా స్పెషల్ ఛార్టర్డ్ ప్లైట్ ఏర్పాటు చేసాయి ఫ్రాంఛైజీలు. డేవిడ్ వార్నర్, పాట్ కమ్మిన్స్ సహా మిగిత ఆటగాళ్లు ప్లైట్ లో పీపీఈ కిట్స్ ధరించి ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.