రాణించిన స్మిత్... ఇండియా లక్ష్యం 287 

రాణించిన స్మిత్... ఇండియా లక్ష్యం 287 

ఇండియా.. ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే ఈరోజు బెంగళూరులో జరుగుతున్న సంగతి తెల్సిందే.  బెంగళూరులో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.  నిర్ణిత యాభై ఓవర్లలో ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసి ఇండియా ముందు 287 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.  

అయితే, స్మిత్ 131 పరుగులు, మార్నస్ 54 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా గౌరవప్రదమైన స్క్రోర్ ను సాధించింది.  ఓపెనర్లు వార్నర్, పించ్ లు తక్కువ స్కోర్ కే వెనుదిరిగినా, స్మిత్ - మార్నస్ లు ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు.  స్మిత్ సెంచరీతో కదం తొక్కగా, మార్నస్ హాఫ్ సెంచరీ చేసి జట్టుకు మంచి స్కోర్ అందించారు. అయితే, చివర్లో ఇండియా బౌలర్లు రాణించడంతో తక్కువ స్కోర్ కు కట్టడి చేయగలిగారు.  ఇండియా బౌలర్లలో షమీ 4, జడేజా 2 వికెట్లు తీసుకోగా, షైనీ, కులదీప్ చెరో వికెట్ తీసుకున్నారు.