యాషెస్ సిరీస్: ఆసీస్ శుభారంభం..

యాషెస్ సిరీస్: ఆసీస్ శుభారంభం..

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు శుభారంభం చేసింది... బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో 251 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఆసీస్ జట్టు. దీంతో యాషెస్ సిరీస్‌లో ఆసీస్ 1-0 ఆధిక్యత సాధించింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌట్ అయ్యింది.. రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 487 పరుగుల భారీ స్కోర్ చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 374 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లండ్.. రెండో ఇన్సింగ్స్‌తో ఆస్ట్రేలియా నిర్దేశించిన టార్గెట్‌ను ఛేదించలేక చతికిలపడిపోయింది. రెండో ఇన్నింగ్స్‌ కేవలం 146 పరుగులకే ముగిచింది. దీంతో ఇంగ్లండ్‌పై ఆసీస్ 251 పరుగుల తేడా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇక రెండు సెంచరీలతో ఆకట్టుకున్న స్టీవెన్ స్మిత్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.