రాంచీ వన్డే: టీమిండియా ఓటమి

రాంచీ వన్డే: టీమిండియా ఓటమి

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా పరాజయం పొందింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో.. ఆస్ట్రేలియా మొదటగా బ్యాటింగ్ చేసి 5 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసి భారత్‌కు 314 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. భారీ టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు 281 పరుగులకే అలౌటైంది. విరాట్‌ కోహ్లీ (123; 95 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్స్) అద్భుత సెంచరీ వృథా అయింది. విజయ్ శంకర్‌ (32), ఎంఎస్‌ ధోనీ (26), కేదార్‌ జాదవ్‌ (26), జడేజా (24) ఫర్వాలేదనిపించారు. అంతకు ముందు ఆసీస్‌లో ఉస్మాన్ ఖవాజా (104), ఆరోన్ ఫించ్‌ (93), మాక్స్‌వెల్‌ (47) రాణించారు. 32 పరుగుల తేడాతో ఆసీస్‌ విజయం సాధించి, సిరీస్‌పై ఆశలు నిలుపుకుంది.