రేప్‌ కేసులో క్రికెటర్‌కు ఐదేళ్ల జైలు శిక్ష..

రేప్‌ కేసులో క్రికెటర్‌కు ఐదేళ్ల జైలు శిక్ష..

రేప్ కేసులో ఓ యువ క్రికెటర్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు.. 2017లో జరిగిన ఘటనలో విచారణ జరిపిన న్యాయస్థానం ఆస్ట్రేలియా యువ క్రికెటర్ అలెక్స్ హెప్‌బర్న్‌ను దోషిగా తేల్చి... ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.  వివరాల్లోకి వెళ్తే 23 ఏళ్ల అలెక్స్ హెప్‌బర్న్ 2017లో ఇంగ్లండ్‌లోని వార్చెస్టెర్‌షేర్‌ కౌంటీ క్రికెట్ క్లబ్‌ తరపున ఆడుతున్నాడు. ఓ రోజు తన సహచర ఆటగాడు జో క్లార్క్‌ ఓ అమ్మాయిని తన గదికి తీసుకొచ్చాడు. అయితే, ఆమె నిద్రిస్తోన్న సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కోర్టులో తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పింది అమ్మాయి. తన కళ్లు మూసుకొని ఉండగా... తనను 20 నిమిషాలపాటూ రేప్ చేశాడని, తాను మొదట అది క్లార్క్ అనుకున్నాననీ, గొంతు విన్న తర్వాతే అది అలెక్స్ అని అర్థమైందని బాధితురాలు వాపోయింది. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణల్ని అలెక్స్ ఖండిస్తూ వచ్చాడు. ఆమె తనతో ఇష్టపూర్వకంగానే శృంగారంలో పాల్గొంది అని చెప్పుకొచ్చాడు. కోర్టు బాధితురాలి వాదనని కూడా పరిశీలించింది. ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని వివరించే సందర్భంలో ఆమె ఎలాంటి అసత్యాలూ పలకలేదని కోర్టు గుర్తించింది. అదే సమయంలో అలెక్ట్స్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నాడని తేల్చింది. వైద్య పరీక్షల్లో కూడా అతను నేరం చేసినట్లు రుజువైంది. తమను తప్పుదారి పట్టించాలని చూసిన హెప్ బర్న్‌పై కోర్టు మండిపడింది. దోషిగా తేల్చిన హెర్ఫోర్డ్ క్రౌన్ కోర్టు అతనికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.