మాకు ధోనీ లాంటి ఆటగాడు కావాలి... 

మాకు ధోనీ లాంటి ఆటగాడు కావాలి... 

మహేంద్ర సింగ్ ధోని ఇటీవల అంతర్జాతీయ క్రికెట్  రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ధోని రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అతనిపై ప్రసంశల వెల్లువ కురుస్తోంది. తాజాగా...   ఇంగ్లాండ్ పై టి 20 మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ కీలక వ్యాఖ్యలు చేసాడు. ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ ఘోరంగా ఫెయిల్ అవ్వడంతో… తమకు టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని లాంటి మంచి ఫినిషర్ కావాలని అతను కామెంట్ చేసాడు. ధోని ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఆటగాడు అని అన్నాడు. ఎందుకంటే అతను 400 వన్డే మ్యాచ్ లను ఆడాడు అని కీర్తించాడు.