ఆ ఇద్దరు జట్టులోకి వస్తే వరల్డ్ కప్ మాదే

ఆ ఇద్దరు జట్టులోకి వస్తే వరల్డ్ కప్ మాదే

స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ ఇద్దరు తిరిగి జట్లులోకి వస్తే ఆస్ట్రేలియా వరల్డ్ కప్ నెగ్గుతుందని ఆ దేశ మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ ధీమా వ్యక్తం చేశారు. మేం వార్నర్‌, స్మిత్‌ను మా బ్యాటింగ్‌ లైనప్‌లో చేరిస్తే మా జట్టు మరింత బలంగా మారుతుందని అన్నారు. ప్రస్తుతం భారత్, ఇంగ్లాండ్ జట్లు చాలా పటిష్టంగా ఉన్నాయని తెలిపారు. ఇంగ్లాండ్‌లోని పరిస్థితులు మాకు బాగా సరిపోతాయి. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలకు ఏం అవసరమో తెలుసని అన్నారు. ఆరంభం నుంచే నేను జట్టు సహాయ కోచ్ గా ప్రభావం చూపగలనని ఆశాభావం వ్యక్తం చేశారు. జట్టులోని యువ క్రికెటర్లు బాగా స్పందిస్తున్నారని కొనియాడారు. నేను భాగస్వామిగా ఉండే జట్టు సీనియర్లు, యువకులతో సమతూకంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. వరల్డ్ కప్‌ ముందు వార్నర్‌, స్మిత్‌, బాన్‌క్రాఫ్ట్‌ జట్టులో చేరికతో చాలా దేశాల కన్నా మా జట్టు బాగుంటుందని పాంటింగ్‌ అన్నాడు. వరల్డ్ కప్ టోర్నీ వరకు పాంటింగ్‌ను క్రికెట్‌ ఆస్ట్రేలియా సహాయ కోచ్‌గా నియమించిన సంగతి తెలిసిందే.