టీమిండియాలో ఆ నలుగురూ ప్రమాదకారులే..!
క్రికెట్ వరల్డ్ కప్‌లో ఇవాళ ఆసక్తికరమైన పోరు జరగనుంది. ఈసారి వరల్డ్ కప్‌లో ఫేవరెట్ జట్లుగా ఉన్న టీమ్‌ల్లో ఉన్న భారత్-ఆస్ట్రేలియా జట్లు ఇవాళ తలపడబోతున్నాయి. అయితే, టీమిండియాలో ఆ నలుగురు ప్రమాదకారులే అంటున్నాడు ఆస్ట్రేలియా కెప్టెన్ ఫించ్.. తమ జట్టులో ఏ ఫార్మాట్లో అయినా సరే.. ప్రస్తుతం స్మిత్ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా రాణిస్తున్నాడని.. ఒక ప్లాన్ ప్రకారం బ్యాటింగ్ చేస్తున్నాడని.. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడి బ్యాటింగ్ మా అందరికీ ఒక పాఠం లాంటిదన్న ఆసీస్ కెప్టెన్... ఇక టీమిండియా విషయానికి వస్తే కెప్టెన్ విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్లకు కుదురుకునే అవకాశమిస్తే ఆపడం కష్టం. రోహిత్ శర్మ అయినా అంతే. వీరిని సాధ్యమైనంత త్వరగా పెవిలియన్‌కు చేర్చాలి. అలాగని కేవలం ఒకరిద్దరిపై దృష్టిసారించలేం. ఎంస్ ధోని, శిఖర్ ధావన్ కూడా ప్రమాదకారులే అని వ్యాఖ్యానించాడు ఆస్ట్రేలియా కెప్టెన్.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)