టీం ఇండియాను ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు : ఆస్ట్రేలియా కోచ్

టీం ఇండియాను ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు : ఆస్ట్రేలియా కోచ్

భారత్-ఆసీస్ టెస్ట్ సిరీస్ లో  గబ్బా వేదికగా జరిగిన నిర్ణయాత్మక చివరి మ్యాచ్ లో టీం ఇండియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే దీని పై ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ... భారత జట్టును ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. టీం ఇండియా అత్యుత్తమమైన జట్టు... అయితే ఈ ఓటమి మాకు చాలాకాలం గుర్తుండిపోతుంది. ఇండియాలో మొత్తం 1.5 ​​బిలియన్ల జనాభా ఉన్నారు. అందులోనుండి కేవలం 11 మంది జట్టులోకి వచ్చారు అంటే అర్ధం చేసుకోవాలి.. వారు ఏ విధమైన ఆటగాల్లో అని లాంగర్ తెలిపాడు. అడిలైడ్ టెస్టులో 36 పరుగులకు ఆల్ ఔట్ అయిన టీం ఇండియా ఇప్పుడు సిరీస్ ను సొంతం చేసుకుంది లాంగర్ పేర్కొన్నాడు. అయితే ఈ మ్యాచ్ లో భారత బ్యాట్స్మెన్స్ కంటే బౌలర్లే మమల్ని ఎక్కువ ఒత్తిడికి గురిచేసారు అని లాంగర్ అన్నాడు. అయితే గాయలకారణంగా భారత సీనియర్ బౌలర్లు అందరూ జట్టుకు దూరం కాగా యువ బౌలర్లతో టీం ఇండియా ఈ మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే.