బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మరికొద్దిసేపట్లో చివరిదైన ఐదో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ వన్డేలో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. షాన్ మార్ష్ స్థానంలో స్టాయినిస్, బెహ్రండార్ఫ్ స్థానంలో నేథన్ లయన్ టీమ్‌లోకి వచ్చారు. మరోవైపు టీమిండియా కూడా రెండు మార్పులు చేసింది. చాహల్ స్థానంలో జడేజా, రాహుల్ స్థానంలో షమి టీమ్‌లోకి వచ్చారు. సిరీస్ 2-2తో సమం అయిన నేపథ్యంలో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. 

జట్లు:

భారత్:
రోహిత్ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లీ, రిషబ్ పంత్‌, కేదార్‌ జాదవ్‌, విజయ్‌శంకర్‌, రవీంద్ర జడేజా, మహమ్మద్‌ షమీ, కుల్‌దీప్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జస్ప్రీత్‌ బుమ్రా.

ఆస్ట్రేలియా:
ఆరోన్‌ ఫించ్‌, ఉస్మాన్‌ ఖవాజా, పీటర్‌ హ్యాండ్స్‌కోంబ్‌, మార్కస్‌ స్టాయినిస్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, ఆస్టన్‌ టర్నర్‌, అలెక్స్‌ కేరీ, జే రిచర్డ్‌ సన్‌, పాట్‌ కమిన్స్‌, ఆడమ్‌ జంపా, నేథన్‌ లయన్‌.