ఇంగ్లాండ్ పర్యటనకు ఆసీస్ జట్టు ప్రకటన... 

ఇంగ్లాండ్ పర్యటనకు ఆసీస్ జట్టు ప్రకటన... 

కరోనా విరామం తర్వాత ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు అంతర్జాతీయ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇస్తూ దూసుకపోతుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు వెస్టిండీస్ తో టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో పాల్గొంటుంది. అందులో భాగంగా జరిగిన మొదటి  మ్యాచ్ లో కరేబియన్లు విజయం కూడా సాధించారు. ఇక వీరితో మ్యాచ్ లు పూర్తయిన తర్వాత పాకిస్థాన్ తో ఆగస్టు లో టెస్ట్, టీ 20 సిరీస్ లలో పాల్గొననుంది. అందుకోసం ఇప్పటికే పాకిస్థాన్ జట్టు ఇంగ్లాండ్ కు చేరుకొని 14 రోజుల నిర్బంధంలో ఉంది. అయితే పాకిస్థాన్ తో పూర్తయిన తరువాత మళ్ళీ సెప్టెంబర్ లో ఆస్ట్రేలియా జట్టుకు ఆతిధ్యం ఇవ్వడానికి సిద్ధమైంది. ఇక ఈ పర్యటన కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తమ ప్రాధమిక జట్టును కూడా ప్రకటించింది. కరోనా కారణంగా బీసీసీసీ లాంటి బోర్డులు ఇంకా ఆటగాళ్లకు శిక్షణ కూడా ప్రారంభించలేదు. కానీ ఇంగ్లాండ్ బోర్డు మాత్రం వరుస సిరీస్ లు నిర్వహిస్తుంది. 

ఆస్ట్రేలియా ప్రాధమిక జట్టు : సీన్ అబోట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, పాట్ కమ్మిన్స్, ఆరోన్ ఫించ్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్చాగ్నే, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, బెన్ మెక్‌డెర్మాట్, రిలే మెరెడిత్, మైఖేల్ నేజర్, జోష్ ఫిలిప్, డేనియల్ సామ్స్, డి'ఆర్సీ షార్ట్, కేన్ రిచర్డ్సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, ఆండ్రూ టై, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.