సెమీస్‌కి ముందు ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ

సెమీస్‌కి ముందు ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ

వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో తలపడబోతున్న ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలింది. ఓపెనర్ ఊస్మాన్ ఖవాజా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఖవాజాకు గాయపడ్డాడు. గాయం తీవ్రమైనందున తగిన విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో ఖవాజా స్వదేశానికి పయనమయ్యాడు. ఖవాజా స్థానంలో మాథ్యూ వేడ్‌ని జట్టులోకి తీసుకుంటున్నట్లు 'క్రికెట్‌ ఆస్ట్రేలియా' పేర్కొంది. లీగ్ దశలో కేవలం ఒక్క మ్యాచ్‌లోనే ఓడిన ఆస్ట్రేలియా జట్టుకు ఖవాజా దూరమవడం పెద్ద దెబ్బేనని చెప్పాలి.