ఆస్ట్రేలియా టార్గెట్ః 208

ఆస్ట్రేలియా టార్గెట్ః 208

ప్రపంచ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో ఆఫ్గానిస్థాన్ 207పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు డకౌట్ కావడం, కీలక బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేయడంతో ఆఫ్గాన్ అతి తక్కువ స్కోర్ నమోదు చేసింది. జార్దాన్ 51, రహ్మత్ షా 43, గుల్బదిన్ 31, రషీద్ ఖాన్ 27 పరుగులు చేశారు. ఆసీస్ బౌలింగ్‌లో పాట్ కమ్మిన్స్ 3, ఆడం జంపా చెరి మూడు, మార్కస్ స్టొయినిస్ 2, మిచెల్ స్టార్క్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్గానిస్థాన్ 38.2 ఓవర్లలో 207 పరుగులు చేసి ఆలౌట్ అయింది.