వన్డే సిరీస్‌కు టాప్ పేసర్లు దూరం

వన్డే సిరీస్‌కు టాప్ పేసర్లు దూరం

టీమిండియాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు ఆస్ట్రేలియా టాప్ పేసర్లు దూరం కానున్నారు. పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్, జోస్‌ హేజిల్‌వుడ్‌లు వన్డే సిరీస్‌కు దూరం కానున్నారు. 2019లో ప్రపంచకప్‌, యాషెస్‌ సిరీస్ ఉండడంతో వీరిపై భారాన్ని తగ్గించాలని క్రికెట్‌ ఆస్ట్రేలియా నిర్ణయించింది. జనవరి 12 నుంచి మూడు వన్డేల సిరీస్‌ ఆరంభం కానుంది.

ఆసీస్ జట్టు కోచ్ ‌జస్టిన్‌ లాంగర్‌ మాట్లాడుతూ...  ముగ్గురు టాప్ బౌలర్లకు విశ్రాంతినిస్తే ఆటగాళ్ల ఎంపికలో ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఎవరిని ఎంపిక చేయాలో ఆలోచించాలి. ముగ్గురికి వన్డే సిరీస్‌లో విశ్రాంతినిస్తే.. తర్వాతి రెండు టెస్టులకు ఉత్సాహంగా ఉంటారు. కమిన్స్‌ అద్భుతంగా ఆడాడు. ప్రతి మ్యాచ్‌కు అతడిని ఎంపిక చేయలేం. వచ్చే ఏడాది ప్రపంచకప్‌, యాషెస్‌ సిరీస్ లు ఉన్నాయి. అందుకే కమిన్స్‌ను కాపాడుకోవడం మా బాధ్యత అని లాంగర్‌ చెప్పుకొచ్చారు.