నేడు ఆసీస్‌తో రెండో వన్డే

నేడు ఆసీస్‌తో రెండో వన్డే

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా  రెండో వన్డేలో ఈ రోజు ఆసీస్‌తో భారత్ తలపడనుంది. తొలి మ్యాచ్‌ ఓడిన నేపథ్యంలో సిరీస్ రేసులో నిలబడాలంటే రెండో వన్డేలో కోహ్లీ సేన నెగ్గి తీరాల్సిందే. టెస్టు సిరీస్‌లో గొప్ప విజయాన్నందించిన అడిలైడ్‌లో ఈ మ్యాచ్‌ జరగబోతుండటం టీమ్‌ఇండియాకు అనుకూలం. మొదటి మ్యాచ్‌లో బౌలర్ల ప్రదర్శన బాగుంది. బుమ్రా లేకపోయినా ఆసీస్‌ను బాగానే కట్టడి చేశారు. చివరి ఓవర్లలో ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ ధాటిగా ఆడటంతో మంచి స్కోరు చేయగలిగింది. 289 పరుగుల లక్ష్యం మరీ పెద్దదేమీ కాదు. కానీ మన బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం ఓటమిని కొనితెచ్చింది. రోహిత్‌ శర్మ భారీ ఇన్నింగ్స్‌ ఆడినా.. మిగితావాళ్లు విఫలమవడంతో మ్యాచ్ చేజారింది. ఈ నేపథ్యంలో రెండో వన్డే బ్యాట్స్‌మెన్‌కు సవాల్ కానుంది.

తొలి వన్డేలో ధవన్‌, కోహ్లీ, రాయుడు స్కోరు బోర్డుపై రెండంకెల స్కోర్ చేయకుండానే వెనుదిరిగారు. రోహిత్‌, ధోనీ భాగస్వామ్యం జట్టు కాపాడింది. నాలుగో స్థానంలో వచ్చిన ధోనీ చాలా బంతులు తీసుకుని అర్ధసెంచరీ సాధించాడు. దినేశ్‌ కార్తీక్‌ విఫలమవడంతో ఆ స్థానంలో కేదార్‌ జాదవ్‌ను ఆడించే చాన్స్‌ ఉంది. తొలి వన్డేలో వికెట్‌ తీయకుండా ధారాళంగా పరుగులు సమర్పించుకున్న పేసర్‌ ఖలీల్‌ స్థానంలో సిరాజ్‌కు చాన్స్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. జడేజా బంతి, బ్యాట్ తో రాణించలేక పోయాడు. ఇతని స్థానంలో చాహల్ కూడా వచ్చే అవకాశాన్ని కొట్టిపాయారేం. అయితే అన్ని విభాగాల్లో సత్తాచాటిన ఆసీస్ మాత్రం ఉత్సహంగా బరిలోకి దిగుతోంది.

జట్లు (అంచనా):

భారత్‌: రోహిత్‌, ధవన్‌, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రాయుడు, ధోనీ, కేదార్‌జాదవ్‌/దినేశ్‌ కార్తీక్‌, జడేజా/చహల్, భువనేశ్వర్‌, కుల్దీప్‌ యాదవ్‌, ఖలీల్‌ అహ్మద్‌/సిరాజ్, షమి.

ఆస్ట్రేలియా: ఫించ్‌ (కెప్టెన్‌), అలెక్స్‌ కేరీ, ఖవాజా, షాన్‌ మార్ష్‌, హ్యాండ్స్‌కోంబ్‌, స్టొయినిస్‌, మ్యాక్స్‌వెల్‌, సిడిల్‌, రిచర్డ్‌సన్‌, లియాన్‌, బెహ్రెన్‌డార్ఫ్‌.