టాస్ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌

టాస్ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌ వేదికగా ఆస్ట్రేలియా, టీమిండియా జట్ల మధ్య మరికాసేపట్లో రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఆసీస్ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. మొదటి వన్డేలో విఫలమయిన ఖలీల్ అహ్మద్ స్థానంలో హైదరాబాద్ పేసర్ మహ్మద్‌ సిరాజ్‌ జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఆసీస్ మాత్రం మొదటి వన్డే జట్టునే కొనసాగిస్తోంది. తొలి వన్డేలో ఓటమి చవిచూసిన టీమిండియా.. సిరీస్‌పై ఆశల్ని నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్‌ తప్పక గెలవాల్సిందే.

జట్లు:

భారత్‌:
రోహిత్‌, ధవన్‌, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రాయుడు, ధోనీ, దినేశ్‌ కార్తీక్‌, జడేజా, భువనేశ్వర్‌, కుల్దీప్‌ యాదవ్‌, సిరాజ్, షమి.

ఆస్ట్రేలియా: 
ఫించ్‌ (కెప్టెన్‌), అలెక్స్‌ కేరీ, ఖవాజా, షాన్‌ మార్ష్‌, హ్యాండ్స్‌కోంబ్‌, స్టొయినిస్‌, మ్యాక్స్‌వెల్‌, సిడిల్‌, రిచర్డ్‌సన్‌, లియాన్‌, బెహ్రెన్‌డార్ఫ్‌.