243 పరుగులకు ఆసీస్ ఆలౌట్

243 పరుగులకు ఆసీస్ ఆలౌట్

భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. భారత బౌలర్ షమీ దాటికి ఆసీస్ 93.2 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా టీమిండియా ముందు 287 పరుగుల విజయలక్ష్యంను ఉంచింది. ఓవర్ నైట్ స్కోర్ 132/4తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్.. మొదటి సెషన్ లో నిలకడగా ఆడుతూ వికెట్ కోల్పోకుండా పరుగులు  చేసింది. టిమ్‌ పైన్‌, ఖవాజాల జోడి ఆచితూచి ఆడుతూ 72 పరుగుల బాగస్వామ్యంను నెలకొల్పారు. లంచ్ అనంతరం వరుస బంతుల్లో షమీ టిమ్‌ పైన్‌ (37), ఆరోన్ ఫించ్ (25)లను పెవీలియన్  పంపాడు. ఆ తర్వాత ఖవాజా (72)ను కూడా అవుట్ చేసాడు. అనంతరం కమ్మిన్స్ (1)ను బుమ్రా, లియోన్ (5)ను షమీ అవుట్ చేసాడు. దీంతో ఆసీస్ కొద్ది వ్యవధిలో 5 వికెట్లను కోల్పోయి కష్టాల్లో  పడింది.

ఈ దశలో స్టార్క్, హేజిల్ వుడ్ లు బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ జోడి చివరి వికెట్ కు 36 పరుగుల బాగస్వామ్యంను నెలకొల్పింది. చివరకు బుమ్రా స్టార్క్ (14)ను బోల్డ్  చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. చివరకు హేజిల్ వుడ్ (17) నాట్ అవుట్ గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో షమీ 6 వికెట్లు.. బుమ్రా 3 వికెట్లు తీశారు.