326 పరుగులకు ఆసీస్ ఆలౌట్

326 పరుగులకు ఆసీస్ ఆలౌట్

పెర్త్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. పేసర్ ఇషాంత్ శర్మ వరుస బంతుల్లో చివరి రెండు వికెట్లు తీయడంతో.. ఆసీస్ 108.3 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌట్ అయింది. 277/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆసీస్‌ రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించింది. ఉదయం టిమ్‌పైన్‌, కమిన్స్‌లు ఆచితూచి ఆడుతూ టీమిండియా బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్నారు. ఈ జోడి ఏడో వికెట్ కు 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ప్రమాదకరంగా మారుతున్న సమయంలో పేసర్ ఉమేష్ యాదవ్.. కమిన్స్‌ (19)ను బోల్డ్ చేసాడు. అనంతరం అదే స్కోర్ వద్ద బుమ్రా.. టిమ్‌పైన్‌ (38)ను ఎల్బీగా పెవిలియన్ పంపాడు. మరో కొద్ది సమయానికి ఇషాంత్ శర్మ వరుస బంతుల్లో స్టార్క్ (6), హేజిల్ వుడ్ (0)లను అవుట్ చేసాడు. నాథన్ లియాన్ (9) నాట్ అవుట్ గా నిలిచాడు. ఆసీస్ ఓపెనర్లు మార్కస్ హారిస్ (70), ఆరోన్ ఫించ్ (50).. ట్రావిస్ హెడ్ (58) అర్ధ సెంచరీలు చేసారు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ నాలుగు వికెట్లు తీసాడు. బుమ్రా, ఉమేష్, విహారి తలో రెండు వికెట్లు తీశారు.