మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్

మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్

పెర్త్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు రాణిస్తున్నారు. రెండో ఇన్నింగ్స్‌ ఆరంభంలో దూకుడుగా ఆడిన ఆసీస్‌ బ్యాట్స్‌మెన్లను ఒక్కొక్కరిని పెవిలియన్ కు పంపిస్తున్నారు. టీ సమయానికి ముందు గాయం కారణంగా ఓపెనర్ ఫించ్ రిటైర్డ్ హర్ట్ గా వెళ్ళిపోయాడు. టీ బ్రేక్ అనంతరం మొదటగా మరో ఓపెనర్ హారిస్‌ (20)ను బుమ్రా బోల్డ్ చేసాడు. ప్రమాదకర షాన్‌ మార్ష్‌‌ (5)ను షమీ అవుట్ చేసాడు. ఇక ఇషాంత్.. పీటర్ హ్యాండ్స్‌కాంబ్‌ (13)ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం క్రీజులో ఉస్మాన్‌ ఖవాజా(23), ట్రావిస్ హెడ్ (7)లు  ఉన్నారు. 28 ఓవర్లు ముగిసే సమయానికి ఆసీస్‌ 3 వికెట్ల నష్టానికి  94 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్ 137 పరుగుల ఆధిక్యంలో ఉంది.