ఛేదనలో టీమిండియాకు షాక్

ఛేదనలో టీమిండియాకు షాక్

పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. 287 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఆసీస్ పేస్ బౌలర్ స్టార్క్ తొలి ఓవర్ నాలుగో బంతికి ఓపెనర్ లోకేష్ రాహుల్ (0)ను బోల్డ్ చేసాడు. దీంతో రాహుల్ పరుగులేమీ చేయకుండానే పెవిలిన్ చేరాడు. అనంతరం పుజారా (4)ను హేజిల్ వుడ్ అవుట్ చేసాడు. 13 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజ్ లో మురళీ విజయ్ (5), విరాట్ కోహ్లీ (0)లు ఉన్నారు. టీమిండియా 4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 13 పరుగులు చేసింది.