రాహుల్ అవుట్..

రాహుల్ అవుట్..

పెర్త్‌ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు మురళీ విజయ్‌, లోకేష్ రాహుల్ లు త్వరగానే పెవిలియన్ చేరారు. 3వ ఓవర్లో మురళీ విజయ్‌ బౌల్డ్‌ (0) అయ్యాడు. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్‌ స్టార్క్‌.. విజయ్‌ని బౌల్డ్‌ చేసాడు. మరికొద్ది సేపటికే మరో ఓపెనర్ రాహుల్ (2).. హాజల్ వుడ్ బౌలింగ్ లో బౌల్డ్‌ అయ్యాడు. దీంతో టీమిండియా 8 పరుగులకే ఓపెనర్లను కోల్పోయి కష్టాల్లో పడింది. టీమిండియా 9 ఓవర్లు ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 25 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో పుజారా (11), కోహ్లీ (6)లు ఉన్నారు. ఆసీస్ స్కోర్ కి భారత్ ఇంకా 301 పరుగులు వెనుకపడి ఉంది.