వికెట్ కోసం చమటోడుస్తున్న బౌలర్లు

వికెట్ కోసం చమటోడుస్తున్న బౌలర్లు

పెర్త్‌ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. భారత బౌలర్లు ఇప్పటికే 13 ఓవర్లు బౌలింగ్ చేసినా.. వికెట్ మాత్రం దక్కలేదు. కెప్టెన్ కోహ్లీ పేస్ బౌలర్లు నలుగురికి బంతిని ఇచ్చినా లాభం లేకపోయింది. ఉమేష్, షమీ, ఇషాంత్, బుమ్రా వికెట్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. 277/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆసీస్‌ రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించింది. ఆట ఆరంభం నుంచే టిమ్‌పైన్‌, కమిన్స్‌లు ఆచితూచి ఆడుతున్నారు. ఈ జోడి అనవసర షాట్లకు పోకుండా పరుగులు సాధిస్తున్నారు. క్రీజులో కమిన్స్‌ (19), ఆసీస్‌ సారథి టిమ్‌పైన్‌ (34) పరుగులతో ఉన్నారు. ఆసీస్‌ 103 ఓవర్లలో 6 వికెట్ల 306 పరుగులు చేసింది.