కోహ్లీ అర్ధ సెంచరీ.. స్కోర్

కోహ్లీ అర్ధ సెంచరీ.. స్కోర్

పెర్త్‌ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా నిలకడగా ఆడుతోంది. టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అర్ధ సెంచరీ పూర్తి చేసాడు. కోహ్లీకి టెస్టు కెరీర్‌లో ఇది 20వ అర్ధ సెంచరీ. తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్లను కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను కోహ్లీ అర్ధ సెంచరీతో ఆదుకున్నాడు. అతనికి పుజారా చక్కటి సహకారం అందించాడు. అయితే స్టార్క్ బౌలింగ్ లో పుజారా (24) క్యాచ్ అవుట్ అయ్యాడు. పుజారా నిష్క్రమణ అనంతరం క్రీజ్ లోకి వచ్చిన రహానే మాత్రం దూకుడుగా ఆడుతున్నాడు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ (54), రహానె (30)లు ఉన్నారు. 50 ఓవర్లు పూర్తయ్యే సరికి మూడు వికెట్ల నష్టానికి టీమిండియా 123 పరుగులు చేసింది.