మరో రెండు వికెట్లు

మరో రెండు వికెట్లు

నాలుగు టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా మరో రెండు వికెట్లను కోల్పోయింది. టీమిండియా పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ క్రీజులో పాతుకుపోయిన ఖవాజా (72)ను పెవీలియన్ పంపాడు. ఇన్నింగ్స్ 82.1 ఓవర్లో ఖవాజా క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లోనే బుమ్రా.. కమ్మిన్స్ (1)ను అవుట్ చేసాడు. దీంతో ఆసీస్ కొద్ది వ్యవధిలో 4 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆసీస్ 86.4 ఓవర్లు ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో లియోన్ (5), స్టార్క్ (0)లు ఉన్నారు. ఆసీస్ ఇప్పటికే 250 పరుగుల ఆధిక్యంలో ఉంది.