మ్యాచ్‌కు వరుణుడి అడ్డంకి

మ్యాచ్‌కు వరుణుడి అడ్డంకి

మెల్‌బోర్న్‌ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి వన్డేకు వరుణుడు అడ్డుపడ్డాడు. వాతావరణం కారణంగా టాస్‌ 15 నిమిషాలు ఆలస్యంగా వేశారు. అయితే మ్యాచ్ మాత్రం 5 నిమిషాలు లేటుగా ప్రారంభమయింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ రెండు బంతులు ఆడే సరికి వర్షం మొదలైంది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. క్రీజులో ఫించ్‌(0), అలెక్స్‌ కారె(1)  ఉన్నారు. మ్యాచ్ మరో పది నిమిషాల్లో మొదలుకానుంది.