లక్షచేధనలో టీమిండియాకు షాక్

లక్షచేధనలో టీమిండియాకు షాక్

మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియాకు షాక్ తగిలింది. 231 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్ల వికెట్ ను కోల్పోయింది. స్టోయినిస్ వేసిన 17 ఓవర్ మూడో బంతికి ధావన్ (23) అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంతకుముందు ఆరో ఓవర్ చివరి బంతికి సిడిల్ రోహిత్ (9) ను క్యాచ్ అవుట్ గా వెనక్కి పంపాడు.  దీంతో ఓపెనర్లను కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది. ప్రస్తుతం టీమిండియా 18 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. క్రీజ్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ (28), ధోనీ (5)లు ఉన్నారు. టీమిండియా విజయం సాధించాలంటే ఇంకా 166 పరుగులు చేయాలి.